అమెరికా సైనికులను హతమార్చితే భారీ నజరానా ఇస్తామన్న ఇరాన్

రిపోర్టర్: సతీష్ స్థలం: టెహ్రాన్

అమెరికా సైనికులను హతమార్చితే భారీ నజరానా ఇస్తామని ఇరాన్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రమీనియా ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా గల్ఫ్ దేశాలలోని తమ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్న ముగ్గురు ఐఆర్జీసీ నాయకుల సమాచారం చెబితే పదిహేను మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సైన్యం కూడా అమెరికా సైనికులను చంపితే కోట్లలో రివార్డు అందిస్తామని సంచలన ప్రకటన చేసింది.