మీరట్లో షాకింగ్ ఘటన: భార్యను కించపరిచాడని ఇద్దరు స్నేహితులను హత్య చేసిన నిందితుడు
రిపోర్టర్: హరి
స్థలం: Meerut
భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతో ఇద్దరు స్నేహితులను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడు మనోజ్ కశ్యప్ గతంలోనూ మరో స్నేహితుడిని హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఎస్ హెచ్ ఓ కేవల్ సింగ్ వెల్లడించారు. సోమవారం రాత్రి జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో నిందితుడి కాలికి గాయాలయ్యాయి.