ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు స్వర్ణ కమలాలు సమర్పించిన మార్గదర్శి
రిపోర్టర్: శివ
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున స్వర్ణ కమలాలను కానుకగా సమర్పించినట్లు మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ తెలిపారు. దుర్గాష్టమి పర్వదినాన అమ్మవారిని దర్శించుకుని, రెండువందల ఎనభై గ్రాముల బరువున్న రెండు బంగారు పుష్పాలను ఆలయ ఈవో శీనా నాయక్‌కు అందజేసినట్లు వెల్లడించారు. నిష్ణాతులైన స్వర్ణకారులు మేలిమి బంగారంతో ఈ పుష్పాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు.