'విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు తప్పదు': బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్ విప్ జారీ

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

తెలంగాణ శాసనమండలి సమావేశాల నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ హైకమాండ్ త్రీలైన్ విప్ జారీ చేసింది. రేపు జరిగే సమావేశాలకు ఎమ్మెల్సీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని, బిల్లులు, తీర్మానాలు, ఓటింగ్ ప్రక్రియలో పార్టీ అధికారిక విధివిధానాల ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేసింది. విప్ ధిక్కరిస్తే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హత వేటు తప్పదని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.