ఓటీటీ వేదికగా అక్టోబర్ 2న పూజా మేరీ జాన్ సినిమా విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: భారతదేశం
మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ పూజా మేరీ జాన్ చిత్ర షూటింగ్ పూర్తయి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ థియేటర్లలో విడుదల నోచుకోలేదు. నవజ్యోతి గులాటీ, విషాషా అరవింద్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 వేదికగా అక్టోబర్ 2 నుంచి డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించి ట్రైలర్‌ను విడుదల చేశారు.