షెడ్యూల్ ప్రకారమే భారత్-అఫ్గాన్ టీ20 మ్యాచ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13న జరగనున్న తొలి టీ20 మ్యాచ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. బ్రిక్స్ సమ్మిట్ నేపథ్యంలో భద్రతా కారణాలరీత్యా మ్యాచ్‌ను వాయిదా వేయాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కోరినప్పటికీ, డీడీసీఏ అధికారులతో జరిగిన చర్చల తర్వాత మ్యాచ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ యథావిధిగా నిర్వహించనున్నట్లు డీడీసీఏ అధికారికంగా స్పష్టం చేసింది.