విశాఖలో వరద ముంపు బాధితులను సురక్షితంగా రక్షించామన్న పోలీసులు
రిపోర్టర్: రమేష్
స్థలం: Visakhapatnam, Andhra Pradesh
విశాఖపట్టణంలో కురిసిన భారీ వర్షాలకు కొమ్మడి, మధురవాడ ప్రాంతాల్లోని రేకన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లలోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో పలువురు నివాసితులు అందులోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.