తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంపునకు విజ్ఞప్తి

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును మరో మూడు వారాలు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. సెప్టెంబర్ 16తో ముగియనున్న గడువును పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే లేఖ రాశారు. 92 లక్షల మందికి నోటీసులు జారీ కావడంతో, ఓటర్లకు తగిన సమయం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసీ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.