చార్టర్డ్ అకౌంటెంట్ విద్యార్థులకు గుడ్ న్యూస్: నేడే సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
చార్టర్డ్ అకౌంటెంట్ ఫౌండేషన్ సెప్టెంబర్ పరీక్షల ఫలితాలను నవంబర్ ఆరున సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు రోల్ నంబర్ ఉపయోగించి స్కోర్‌కార్డ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ రెండు, ఐదు, ఏడు మరియు తొమ్మిదో తేదీల్ లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.