రాజ్‌కుమార్ రావు సినిమాపై ఉజ్వల్ నికం కీలక షరతులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Mumbai
ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ప్రహార్. ఈ సినిమా రూపకల్పన సమయంలో తాను ఎలాంటి ప్రశంసలు లేదా అతిశయోక్తులు ఉండకూడదనే ప్రధాన షరతు విధించినట్లు ఉజ్వల్ నికం స్పష్టం చేశారు. చిత్రంలో రాజ్‌కుమార్ రావు తన పాత్రలో అద్భుతంగా నటించారని ఆయన ప్రశంసించారు.