నో యూపీఐ డే నిరసనను విరమించిన వాణిజ్య సంఘాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
ఎండీఆర్ ఛార్జీలపై నిరసనగా అక్టోబర్ 2న తలపెట్టిన నో యూపీఐ డే నిరసనను విరమించుకుంటున్నట్లు ప్రముఖ వాణిజ్య సంఘాలైన ఏఐసీపీడీఎఫ్, ఏఐఎంఆర్ఏ ప్రకటించాయని ప్రతినిధులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి తమ ఆందోళనలను వివరించినట్లు వారు వెల్లడించారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తుందనే నమ్మకంతో పండుగ సీజన్ ముగిసే వరకు ఈ ప్రణాళికను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు.