తెలంగాణ అసెంబ్లీలో హైఓల్టేజ్ రాజకీయ వేడి, స్పీకర్‌పై దుమారం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

తెలంగాణ శాసనసభ సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీని పదవి నుంచి డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. స్పీకర్ కంటతడి పెట్టడం అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. అసెంబ్లీ వెలుపల బీఆర్ఎస్ నిరసనలు, అరెస్టులతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.