శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామ్మోహన్ నాయుడు

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం వల్లే దశాబ్దాల సమస్యలు పరిష్కారమవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీలో చేరగా, వారికి మంత్రి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.