ఉత్తరప్రదేశ్ లో పూజ గొడవలో భార్య ఇద్దరు పూజారులు సహా నలుగురి హత్య
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Azamgarh
ఉత్తరప్రదేశ్ లోని అజమ్‌గఢ్ జిల్లాలో పూజ గొడవలో అరవింద్ సింగ్ అనే వ్యక్తి తన భార్య బబిత, ఇద్దరు పూజారులతో పాటు తన స్వంత బిడ్డను కాల్చి చంపిన దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో జరుగుతున్న పూజను వ్యతిరేకించిన నిందితుడు లైసెన్సెస్ పిస్టల్ తో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం ముగ్గురు పిల్లలను బందీలుగా ఉంచి పోలీసులపైకి కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు.