బాల్కనీ నుంచి కిందపడి జాతీయ పతక విజేత దుర్మరణం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఘజియాబాద్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రాచి పన్నెండో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. బాల్కనీలో ఆరేసిన దుస్తులు తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. జాతీయ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించి ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ దుర్ఘటన జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.