బొబ్బిలిలో టీడీపీలోకి భారీగా చేరికలు.. హరిజనపాల్తేరు వాసుల నిర్ణయం

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బాడంగి

బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం హరిజనపాల్తేరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరాయి. బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన), మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు.

మాజీ ఎంపీపీ బొంతు త్రినాథ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేబీ నాయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులయ్యే తాము టీడీపీలో చేరామని కొత్తగా చేరిన వారు ఈ సందర్భంగా వెల్లడించారు.