బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అన్యాయం: కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల అరెస్ట్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. దమ్ముంటే హామీల అమలుపై చర్చించాలని, తాము స్వచ్ఛందంగా అరెస్ట్‌కు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు.