అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత దౌత్యవేత్త

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్థాన్కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అప్పులతో కుదేలైన పాకిస్థాన్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంపై శ్రద్ధ పెట్టాలని, సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపాలని భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి హితవు పలికారు. పీఓకేలో పౌరులపై జరుగుతున్న దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలను ఎండగట్టారు. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని స్పష్టం చేస్తూ, అక్రమ ఆక్రమిత ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేసింది.