స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్పష్టత: ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలన్న ధర్మాసనం
రిపోర్టర్: కిరణ్
స్థలం: దిల్లీ
స్థానిక సంస్థల ఎన్నికల్ లో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధారాలతో పిటిషన్లు దాఖలు చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. నామినేషన్ల గడువు పెంపు కోరుతూ వైకాపా దాఖలు చేసిన ఎస్ఎల్పీ విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు.