ముద్దనూరు-పుట్టపర్తి రైల్వే లైన్ డిపిఆర్ పూర్తి!

రిపోర్టర్: వెంకట్ స్థలం: వైఎస్సార్ కడప

వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వరకు రూ. 2,505 కోట్ల అంచనా వ్యయంతో 105.31 కిలోమీటర్ల నిడివితో ప్రతిపాదించిన నూతన రైల్వే లైన్ డీపీఆర్ పూర్తయింది. రైల్వే బోర్డు ప్రాథమిక క్లియరెన్స్ లభించడంతో పులివెందుల మీదుగా సాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ వాసుల బెంగళూరు ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ఈ మార్గంలో 8 నూతన స్టేషన్లను నిర్మించనున్నారు.