మార్లగుంటలో వీధి కుక్కల స్వైరవిహారంతో వణికిపోతున్న విద్యార్థులు

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలం మార్లగుంట గ్రామంలో వీధికుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఒంటరిగా బయటకు రావాలంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కొందరిని గాయపరిచిన కుక్కలు, తాజాగా ఒకటో తరగతి బాలుడిపై దాడి చేశాయి. దీంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.