ఆటోలో పోయిన బంగారు నెక్లెస్ స్వాధీనం చేసుకుని అందించిన పోలీసులు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ లో ఆటోలో మరిచిపోయిన ఇరవై గ్రాముల బంగారు నెక్లెస్ మరియు సెల్ ఫోన్ ఉన్న పర్సును పోలీసులు బాధితురాలికి అప్పగించారు. మల్లికార్జున నగర్ కు చెందిన మంగ అనే మహిళ గుడికి వెళ్లొస్తూ పర్సును పోగొట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆటోను గుర్తించి పర్సును స్వాధీనం చేసుకుని ఆదివారం అప్పగించడంతో అధికారులు అభినందించారు.