బీఆర్ఎస్ కుట్రలను దీటుగా తిప్పికొట్టాలని సీఎం రేవంత్ పిలుపు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రలను దీటుగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నాయకుల్లో అహంకారం తగ్గలేదని ఆయన మండిపడ్డారు. సభా సాక్షిగా బీఆర్ఎస్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరై చురుగ్గా పాల్గొనాలని సీఎం స్పష్టం చేశారు.