రేణిగుంట రైల్వే స్టేషన్లో హైడ్రామా ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి రక్షణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లాలోని రేణిగుంట రైల్వే స్టేషన్లో అస్సాంకు చెందిన ఒక వ్యక్తి ఆగి ఉన్న రైలు పైకెక్కి ఆత్మహత్యకు యత్నించాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సిబ్బంది అతనికి సర్దిచెప్పడానికి ప్రయత్నించగా వారిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో కిందపడిపోతున్న అతన్ని ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణ నెట్ సహాయంతో ప్రాణాలతో కాపాడి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కారణంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.