అనంతపురం బొగ్గుల బట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తున్న తొంబై ఎనిమిది మందికి విముక్తి

రిపోర్టర్: సునీల్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లాలో బొగ్గుల బట్టీల్లో ఐదేళ్లుగా వెట్టిచాకిరీ చేస్తున్న తొంబై ఎనిమిది మందికి రెవెన్యూ, కార్మిక, పోలీసు అధికారులు విముక్తి కల్పించారు. మహారాష్ట్రకు చెందిన కూలీలతో బొగ్గుల తయారీ పనులు చేయిస్తూ మధ్యవర్తులు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించి సొంతూళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. పరారీలో ఉన్న పదకొండు మంది మధ్యవర్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు ఆర్డీవో వసంతబాబు వెల్లడించారు.