యాదవ మహాసభ జిల్లా సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందమర్రి
మందమర్రి పట్టణంలో ఈనెల 20వ తేదీన జరగనున్న అఖిల భారత యాదవ మహా సభ జిల్లా స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాలు, మున్సిపాలిటీలలో త్వరలో యాదవ సంఘం కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. యాదవుల సమస్యల పరిష్కారానికి ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై తీర్మాణాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.