'ప్రజా సమస్యలపై కొట్లాటను అడ్డుకుంటున్నారు': రేవంత్ సర్కార్ తీరుపై హరీష్ రావు ఫైర్

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

ప్రజా సమస్యలపై పోరాడేందుకు నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ నేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. సభలోకి నల్ల టీషర్టులతో అనుమతి లేదంటూ రేవంత్ సర్కార్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.