వైద్య సేవల తీరుపై ఏన్కూరు పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఏన్కూరు

ఖమ్మం జిల్లా ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్ బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుతో పాటు వైద్య రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు తగిన అవగాహన కల్పించి, తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆయన ఆదేశించారు.