విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్లపై ముమ్మర నిఘా

రిపోర్టర్: సతీష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కోరియర్ కార్యాలయాలు తదితర కీలక ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, లగేజ్ బ్యాగులు, పార్సిళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.