మాజీ నక్సలైట్ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో జన తెలంగాణ పార్టీ ఏర్పాటు

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా మాజీ నక్సలైట్లు, మాజీ మావోయిస్టులు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. లంకా పాపిరెడ్డి, బల్ల రవీంద్రనాథ్, గురిజాల రవీందర్‌రావు తదితరుల ఆధ్వర్యంలో త్వరలోనే జన తెలంగాణ పార్టీ పేరుతో ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ అభ్యర్ధులను బరిలో నిలపాలని ఈ కొత్త వేదిక భావిస్తోంది.