గుర్గావ్ పోలీసుల దర్యాప్తు తీరుపై ఢిల్లీ కోర్టు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

యువరాజ్ సింగ్ మంచంద హత్య కేసు దర్యాప్తుపై గురుగ్రామ్ పోలీసులను ఢిల్లీలోని సాకేత్ కోర్టు తీవ్రంగా మందలించింది. మృతదేహాన్ని గుర్తించకుండానే దహన సంస్కారాలు చేయడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులు యువరాజ్‌ను కాల్చి చంపి నాలాలో పడేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికలో మృతికి గల కారణాలపై వైరుధ్యాలు ఉండటంతో, మృతుడి కుటుంబసభ్యులు అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.