విజయనగరం జిల్లా గ్రంథాలయాల్లో వేధిస్తున్న సిబ్బంది కొరత

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

విజయనగరం ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొత్తం 41 గ్రంథాలయాల్లో వందకు పైగా ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, కేవలం 32 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సిబ్బంది లేకపోవడంతో సమయానికి గ్రంథాలయాలు తెరుచుకోక పాఠకులు, నిరుద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది.