దేశవ్యాప్తంగా రైళ్లలో అక్టోబర్ నెలంతా స్పెషల్ టికెట్ చెకింగ్ డ్రైవ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
రైళ్లలో అనధికారిక ప్రయాణాలను అరికట్టేందుకు సెంట్రల్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక టికెట్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాయితీ టికెట్లు, ఈ-పాస్‌లు, గ్రూప్ బుకింగ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు చెప్పారు. ప్రయాణికులు విధిగా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులను తమ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.