మతసామరస్య వేదికగా హోన్నూరు స్వామి ఉరుసు: వైభవంగా దేవుడే సవారి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని దర్గా హోన్నూరులో హోన్నూరు స్వామి దేవుడే సవారి శనివారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేడుకలో మతసామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు పెద్ద సంఖ్యలో ఐక్యంగా పాల్గొన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.