మద్యం రవాణా కుంభకోణం కేసు: చంచల్గూడ జైలులో కారుమూరి సునీల్ను విచారిస్తున్న సిట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రెండు రోజుల కస్టడీలో కారుమూరి సునీల్ను హైదరాబాద్ చంచల్గూడ జైలులో ఇవాళ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ రవాణా టెండర్లలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. టెండర్ల నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు మరియు ఇతర కీలక అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి.