ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో అర్ధ శతకంతో మెరిసిన సాయి సుదర్శన్

రిపోర్టర్: విజయ్ స్థలం: పుదుచ్చేరి

పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా ఏ జట్లతో జరుగుతున్న తొలి నాలుగు రోజుల మ్యాచ్ లో భారత్ ఏ జట్టు తరఫున ఆడుతున్న సాయి సుదర్శన్ అద్భుతమైన అర్ధ శతకంతో రాణించారు. కాలు గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన ఆయన 57 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. మరోవైపు కుశాగ్ర 82 పరుగులతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగగా తనుశ్ కోటియన్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు.