డిగ్రీ అధ్యాపకులకు తీపి కబురు: పీఆర్సీ బకాయిలపై భట్టి విక్రమార్క హామీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

డిగ్రీ కాలేజీల అధ్యాపకుల పీఆర్సీ బకాయిలు త్వరలోనే అందేలా తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దశాబ్దకాలంగా పెండింగ్ లో ఉన్న యూజీసీ ఏడో పీఆర్సీ వేతన సవరణ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీజీసీటీఏ నేతలు శనివారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎస్ పరిధిలోని అధ్యాపకులకు తగిన వెసులుబాటు కల్పిస్తామని, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీపైనా సానుకూలంగా స్పందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.