ఉద్యోగం దొరక్క నిరుద్యోగి ఆత్మహత్య: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం

రిపోర్టర్: సతీష్ స్థలం: కరీంనగర్

ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎల్ఎండీ ఎస్సై అరుణ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన బూడిద నితిన్ ఎంబీఎల్టీ పూర్తి చేసి ఉపాధి కోసం అనేక దవాఖానల చుట్టూ తిరిగినా ఉద్యోగం దొరకలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఇంట్ లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించాడని, తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.