అభ్యర్థులకు అలర్ట్: ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డుల విడుదల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అధికారులు వెల్లడించారు. ఈ అక్టోబర్ పదవ తేదీన మరియు పదకొండవ తేదీన ఈ ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు సంఖ్య, పాస్వర్డ్ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.