కావలిలో ఆవుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు వినతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కావలి
కావలి పట్టణంలో ప్రధాన వీధుల్ లో ఎదురవుతున్న ఆవుల సమస్యను సత్వరం పరిష్కరించాలని శ్రీ వాసవి సెవెన్ లైన్స్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు పురపాలక సంఘం కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ కు వారు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఇటీవల ఓ వృద్ధుడు ఆవు పొడవడంతో మరణించిన సంఘటనను గుర్తుచేశారు. పురపాలక సంఘం తరఫున ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.