వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర నిప్పులు

రిపోర్టర్: సతీష్ స్థలం: Andhra Pradesh

మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉంటే గత విజయం రిగ్గింగ్ వల్లే సాధ్యమైందని ఒప్పుకోవాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ మరింత పాజిటివ్గా మారిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతల స్వార్థపూరిత తీరు వల్లే సొంత ఊరి ప్రజలే వారిని పూర్తిగా పక్కన పెట్టారని ఆదినారాయణ రెడ్డి ఘాటుగా విమర్శించారు.