వైద్య సిబ్బంది సమ్మె బాట: అత్యవసర సేవలు మినహా సాధారణ వైద్యం బంద్

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె బాట పట్టారని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ ఆందోళనతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.