తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణ అనుమతులపై కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ సీఎంఓ వెల్లడించింది. బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కోరిన అన్నిరకాల సమాచారాన్ని ఇప్పటికే అందించామని పేర్కొంటూ, ఈ అంశంపై కేంద్రం చొరవ తీసుకుని సాధ్యమైనంత త్వరగా అనుమతులు మంజూరు చేసేలా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారని ఆ అధికారిక ట్వీట్లో స్పష్టం చేశారు.