గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన అల్లు అర్జున్ అట్లీ రాకా సినిమా
రిపోర్టర్: సునీల్
స్థలం: India
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న రాకా సినిమా అరుదైన ఘనత సాధించింది. రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి 37 మందిని చిత్రీకరించి విజువల్ ఎఫెక్ట్స్‌లో కొత్త ప్రయోగం చేసిన రాకా బృందం గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో 19 మందితో ఉన్న రికార్డును ఈ టీమ్ అధిగమించగా, అల్లు అర్జున్ మరియు అట్లీ ఈ గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, రష్మిక మందన్నా, మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు.