యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు సురేంద్ర ఆచార్యులకు దక్కిన ప్రతిష్టాత్మక ప్లాటినం ఐకాన్ అవార్డు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉజ్వల శిఖరము ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన వేడుకలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ బట్టార్ సురేంద్ర ఆచార్య ఘనంగా సన్మానించబడ్డారు. ఆధ్యాత్మిక రంగంలో ఆయన అందిస్తున్న నిరంతర సేవలను గుర్తించి నిర్వాహకులు ఈ ప్రతిష్టాత్మక ప్లాటినం ఐకాన్ అవార్డును ప్రదానం చేసి అభినందించారు.