ఖమ్మం జిల్లాలో విషాదం: సాగర్ కాలువలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

రిపోర్టర్: మహేష్ స్థలం: Khammam

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయుడు దొడ్డపునేని వెంకటేశ్వరరావు అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందులతో సాగర్ కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆయన, పిల్లలను బాగా చూసుకోవాలని లేఖ రాసి కాలువలో గల్లంతయ్యారు. పది గంటల పాటు గాలించిన గజ ఈతగాళ్లు ఆయన మృతదేహాన్ని ఘటనాస్థలానికి దూరంగా గుర్తించారని స్థానికులు పేర్కొన్నారు.