క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో తీవ్ర విషాదం, తండ్రి కన్నుమూత

రిపోర్టర్: సురేష్ స్థలం: కేరళ

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శాంతకుమారన్ నాయర్ అనారోగ్యంతో కొచ్చిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శాంతకుమారన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, క్రీడాకారులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.