తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పంపిణీపై విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, పాలు పంపిణీ ప్రక్రియపై విద్యాశాఖ నూతన నిబంధనలు జారీ చేసింది. పాఠశాలల్లో ఉదయం 9.30 గంటలలోపు అల్పాహారం పూర్తి చేయాలని, సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా ఉదయం 6.30 నుంచి 8.45 గంటల మధ్య టిఫిన్ సరఫరా చేయాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడులకు బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్ పథకాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.