రాప్తాడులో దారుణం: పాఠశాలలో విద్యార్థినిపై రంపంతో ఉన్మాది దాడి
రిపోర్టర్: రమేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది చెట్లు నరికే రంపం మిషన్తో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని పోలీసులు తెలిపారు. ఈ అమానుష ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. రక్తపుమడుగులో పడిఉన్న బాధితురాలిని స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.