పులివెందుల ఎన్నికల్ లో వైసీపీకి షాక్: హైకోర్టులో పిటిషన్ కొట్టివేత

రిపోర్టర్: అశోక్ స్థలం: కడప

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్ లో రీపోలింగ్ కోరుతూ వైసీపీ వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసిందని హైకోర్టు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ కౌంటింగ్ కు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, చైర్పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, ప్రత్యామ్నాయ వేదికను చూసుకోవాలని సూచించిందని వెల్లడించారు. దీంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.